అందుకే ఎలాగైనా రూట్ మార్చాలి, వేగం పెంచాలి అని మన హీరోలు ఫీల్ అవుతున్నారట. ప్రస్తుతం నాని, నితిన్, నాగచైతన్య, వరుణ్ తేజ్, సాయి తేజ్, నిఖిల్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు వరుసగా సినిమాలను సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా జూమ్ యాప్ ద్వారా అందరూ కథలు వింటున్నారు.
ఇండస్ట్రీలోని కథలు పట్టుకుని తిరుగుతున్న కొత్త రచయితలకు, దర్శకులకు ఇది సువర్ణావకాశమే. కథ చెప్పడానికే ఏళ్ల తరబడి తిరిగే పని లేకుండా హీరోలే కథ ఉంటే చెప్పండి అంటూ ఆరా తీయడంతో కొత్తవాళ్లకు ఇది మంచి అవకాశంగా మారింది. నాని ఇప్పటికే నాలుగు కథలు విన్నాడట. అందులో రెండు కథలను ఓకే చేశాడని తెలుస్తోంది. అలాగే నితిన్ కూడా ప్రస్తుతం కథలు వింటున్నాడు.
నిజానికి నితిన్ ప్రస్తుతం చేస్తోన్న 3 సినిమాల గురించి అందరికీ తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంథాధూన్ రీమేక్ చేస్తున్నాడు, అలాగే కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాతో పాటు కోన వెంకట్ నిర్మాణంలో మరో సినిమా చేసున్నాడు. అయినా వరుసగా కథలు వింటుండటం విశేషం. అటు నిఖిల్, నాగచైతన్య చేతిలో కూడా నాలుగేసి సినిమాలున్నాయి, అయినా వాళ్ళు కూడా ప్రస్తుతం కొత్త సినిమాలను సెట్ చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. మిగతా యంగ్ హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.