షాకింగ్ : రజినీకాంత్ రికార్డ్ ను బ్రేక్ చేస్తోన్న బాలయ్య !

దక్షిణాదిలో సీనియర్ స్టార్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ “కబాలి” టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బ్రేక్ చేసే దిశగా బాలయ్య ‘అఖండ’ టీజర్ పరుగులు పెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం అఖండ టీజర్ 36 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ దగ్గరలో ఉంది. మరో కొన్ని గంటల్లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయబోతున్నాడు. బహుశా ఈ రికార్డ్ తన పేరిట నమోదు […]

Written By: admin, Updated On : April 23, 2021 10:14 am
Follow us on

దక్షిణాదిలో సీనియర్ స్టార్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ “కబాలి” టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బ్రేక్ చేసే దిశగా బాలయ్య ‘అఖండ’ టీజర్ పరుగులు పెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం అఖండ టీజర్ 36 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ దగ్గరలో ఉంది. మరో కొన్ని గంటల్లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయబోతున్నాడు. బహుశా ఈ రికార్డ్ తన పేరిట నమోదు అవుతుందని బాలయ్య కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు. ఏది ఏమైనా నందమూరి అభిమానులకు సగర్వంగా చెప్పుకోవడానికి మొత్తానికి ఒక సరికొత్త రికార్డ్ అయితే దొరికింది.

నిజనాకి బాలయ్య సినిమాలకు గత కొన్ని సంవత్సరాలుగా మినిమమ్ ఓపెనింగ్స్ రావడం లేదు. అలాంటిది ఏకంగా బాలయ్య టీజర్, రజినీకాంత్ టీజర్ నే వెనక్కి నెట్టేసేలా వ్యూస్ ను తెచ్చుకోవడం అంటే మాటలా. ఒకవిధంగా చాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడని.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును అభినందిస్తున్నారు బాలయ్య సన్నిహితులు. రికార్డ్స్ క్రియేట్ చేయడం ఎప్పుడో మర్చిపోయిన మా హీరో చేత.. ఏకంగా సూపర్ స్టార్ రికార్డ్ నే బ్రేక్ చేయించడం ఒక్క బోయపాటికే సాధ్యం అయిందని బాలయ్య ఫ్యాన్స్ బోయపాటికి బొకేలు పంపుతున్నారట.

ఇక బోయపాటి డైరెక్షన్ లో వస్తోన్న ఈ ‘అఖండ’ పై ఈ చిన్నపాటి టీజర్ తో అనూహ్యంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ టీజర్ బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకోవడం విశేషం. బాలయ్యకి ఇంకా స్టార్ డమ్ ఉందని ఈ టీజర్ నిరూపించింది. వాస్తవానికి బాలయ్య సినిమాలు ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమాల లాగా చలామణి అవ్వట్లేదు. దాంతో బాలయ్య స్టార్ డమ్ పైనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలకు బ్రేక్ పడింది.

ఇక తెలుగులో మన సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా ఇప్పుడు బాలయ్య సినిమా టీజర్ ఉండటం మిగితా స్టార్ హీరోలకు కూడా ఆశ్చర్యానికి గురి చేసిందట. అసలు బాలయ్యకి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అంటూ షాక్ అవుతున్నారట. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.