
దేశంలో 24.1 శాతం మంది ప్రజలు కరోనా బారినపడినట్లు భారత వైద్య పరిశోదనా మండలి తాజాగా జరిపిన సెరో సర్వేలో వెల్లడైంది. ఒక్క వైరస్ కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్ సోకినట్లే అని పేర్కొంది. దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని ఐసీఎంఆర్ సర్వే స్పష్టం చేసింది. ఈ లెక్కలకు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలకు అసలే మాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. భారత వైద్య పరిశోధనా మండలి మూడోసారి నిర్వహించిన సెరో సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 24.1 శాతం మంది ఇప్పటికే కరోనా వైరస్ బారినపడినట్లు ఈ సర్వే తేల్చింది.