
కరోనా రెండో దశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మూడో దశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. రెండో దశలో పడకలు, ఆక్సిన్ కు తీవ్ర కొరత ఏర్పడిందని, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నామని ఉద్ధవ్ తెలిపారు. మరోవైపు దేశంలోనూ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని, రాష్ట్రానికి వ్యాక్సినేషన్ సరపరాను బట్టి జూన్ నెలలో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఉద్ధవ్ వెల్లడించారు.