Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్హైదరాబాద్ జూపార్క్ లోని సింహాలకు కరోనా.. జూ మూసివేత

హైదరాబాద్ జూపార్క్ లోని సింహాలకు కరోనా.. జూ మూసివేత

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 8 ఆసియా సింహాలు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24 నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్ లో ఉంచారు.  అలాగే వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version