
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పంజా విసురుతోంది. రోజు వేలాది కేసులు వస్తుండడంతో హాస్పటళ్లకు రోగులు క్యూ కడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల మధ్య పలువురు వైద్యులు మహమ్మారి బారినపడుతున్నారు. ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్ లో 80 మంది వైద్యులు కరో్నా పాజిటవ్ గా పరీక్షించడం కలకలం రేపుతోంది. ఇందులో 12 మంది వైద్యులు ఇంట్లో ఐసోలేసన్ లో ఉండగా 12 మంది చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. ఆసుపత్రిలో సీనియర్ సర్జన్ డాక్టర్ ఏకే రావత్ కరోనాతో మరణించారు.