
తెలంగాణలోని యాదగిరి గుట్ట మండలం వంగపల్లి పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు ఈ మహమ్మారి సోకింది. దీంతో పలువురు ఉపాధ్యాయులు హోం క్వారంటైన్ లో ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.