
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20 కోట్ల మార్క్ ను దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97,45 శాతానికి చేరుకుంది. వైరస్ బారినపడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారిసంఖ్య 4,29,179కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,86,351 యాక్టివ్ కేసులు ఉన్నాయి.