Corona India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 25,166 మందికి పాజిటివ్ గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20 వేల కేసులు వెలుగుచూస్తుండా తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి. నిన్న మరో 437 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,32,079కి చేరింది. ప్రస్తుతం 3,69,846 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. […]
Written By:
, Updated On : August 17, 2021 / 09:59 AM IST

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 25,166 మందికి పాజిటివ్ గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20 వేల కేసులు వెలుగుచూస్తుండా తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి. నిన్న మరో 437 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,32,079కి చేరింది. ప్రస్తుతం 3,69,846 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. తాజాగా 36,830 మంది కోలుకున్నారు.