
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రెండు లక్షలకు పైగా నమోదైన కేసులు. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ట స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. మరో 3,660 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కి చేరగా ఇప్పటి వరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. మొత్తం 3,18,895 మంది వైరస్ బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులు ఉన్నాయి.