
ఢిల్లీలో కరోనా కేసులు గురువారం 3009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కవ స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేతకు ఒత్తిడి పెరుగుతోంది. కాకపోతే వైద్య నిపుణులు మాత్రం లాక్ డౌన్ ఫలితంగానే కరోనా దిగివచ్చిందని అంటున్నారు. ఢిల్లీలో కొత్త కరోనా కేసులు వరుసగా మూడో రోజు 4 వేల దిగువకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ఏప్రిల్ నుంచి మొదలైన సెకండ్ వేవ్ ఢిల్లీ సర్కారుకు కేంద్రానికి మధ్య వివాదాలకు కారణమైంది.