https://oktelugu.com/

ఏపీలో ఆయుర్వేద కరోనా మందు సక్సెస్.. జగన్ కీలక నిర్ణయం

భారత్ ను కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. మన ప్రాచీన వైద్య విధానాలు అయిన ఆయుర్వేదాన్ని మరిచి అల్లోపతి మందులతో చేస్తున్న యుద్ధం సరిపోవడం లేదు. వేల మంది ప్రాణాలు పోతున్నాయి. లక్షలమందికి ఈ వ్యాధి సోకుతోంది. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా.. ఎంత మందులు తెచ్చినా ఆ మాయదారి కరోనా రోగం పోవడం లేదు. ఇప్పటికీ ఎంతో మందిని బలితీసుకుంటోంది. అయితే మన ప్రాచీన ఆయుర్వేదం దీనికి విరుగుడుగా పనిచేస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2021 / 04:08 PM IST
    Follow us on

    భారత్ ను కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. మన ప్రాచీన వైద్య విధానాలు అయిన ఆయుర్వేదాన్ని మరిచి అల్లోపతి మందులతో చేస్తున్న యుద్ధం సరిపోవడం లేదు. వేల మంది ప్రాణాలు పోతున్నాయి. లక్షలమందికి ఈ వ్యాధి సోకుతోంది. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా.. ఎంత మందులు తెచ్చినా ఆ మాయదారి కరోనా రోగం పోవడం లేదు. ఇప్పటికీ ఎంతో మందిని బలితీసుకుంటోంది.

    అయితే మన ప్రాచీన ఆయుర్వేదం దీనికి విరుగుడుగా పనిచేస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనాకు విరుగుడుగా పనిచేస్తోందన్న ప్రచారం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో జనాలు పిట్టల్లా రాలుతున్న వేళ ఆనందయ్య ఆయుర్వేద మందు అద్భుతంగా పనిచేస్తోందని వాడిన వారు చెబుతున్నారు.

    ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనా తగ్గిస్తుండడంతో ఏపీ నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి జనం దాన్ని తీసుకువెళుతున్నారు.ఇక జనం ఇంతలా ఆయుర్వేద మందు కోసం ఎగబడుతుండడంతో ఏపీలోని జగన్ ప్రభుత్వం సైతం దానిపై దృష్టిసారించింది. స్థానిక అధికార యంత్రాంగంతో ఆ మందుపై నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం దాని పంపిణీకి అధికారికంగా అనుమతిచ్చింది.

    అంతేకాదు.. తాజాగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్ తో ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయాలని జగన్ సంచలన ఆదేశాలు ఇచ్చారు. దాన్ని అధికారికంగా అందరికీ పంచాలని ఏపీ సర్కార్ ఆదేశించడం సంచలనమైంది.

    కరోనా వ్యాధికి విరుగుడుగా ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్యపై లోకాయుక్త ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ దీనిపై నివేదిక తెప్పించుకొని మందు పనిచేస్తోందని పంపిణీ చేయడానికి కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

    ఈ శుక్రవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నంలో ఆయుర్వేద మందును పంపిణీని పున: ప్రారంభించారు. దాదాపు 3వేవల మందికి మందును పంపిణీ చేశారు.అయితే అప్పటికే అక్కడికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ జనాన్ని పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాట చోటుచేసుకుంది. అంతమందికి మూలికలు, మందు లేదని చెప్పినా జనాలు ఎగబడ్డారు. మూలికలన్నీ అయిపోవడంతో రెండురోజుల పాటు మందు పంపిణీని ఆనందయ్య నిలిపివేశారు.

    ఆనందయ్య కరోనా మందుపనిచేస్తుందని తెలియగానే కృష్ణపట్నంకు జనం పోటెత్తారు. కృష్ణపట్నంకు వెళ్లే ముత్తుకూరు రోడ్డు మార్గం కి.మీ మేర వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడున్న డిమాండ్ కు మందును సరఫరా చేయాలంటే ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇప్పటివరకు సొంత ఖర్చుతో ఉచితంగానే ఆనందయ్య పంపిణీ చేశారు. అయితే డిమాండ్ దృష్ట్యా భారీ ఎత్తున ముడిసరుకు కావాలని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వం ఆనందయ్యకు సహకరించడానికి సిద్ధమైంది. డిమాండ్ దృష్ట్యా దీన్ని ఏపీలోని గ్రామాల్లో ఈ మందు పంపిణీ చేపట్టనున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ తెలిపారు.

    గత ఏడాది నుంచి ఆనందయ్య కరోనాకు మందు ఇస్తున్నాడు. అయితే అది కృష్ణపట్నంకే పరిమితమైంది. సెకండ్ వేవ్ పెరగడం.. ఈ మందువాడి కోలుకున్న వారి సంఖ్య బాగా పెరగడంతో ఆనందయ్య పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్రాలు దాటింది. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు కట్టిన వారు సైతం వచ్చి ఈ మందును తీసుకుపోతున్నారు. ఈ మందు తీసుకున్నాక శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని చెబుతున్నారు. ఆనందయ్య మందువాడిన వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవు. చాలా మంది కోలుకున్నారు.

    అయితే ఆయుర్వేద మందులు తగ్గించలేని ఈ కరోనా రోగాన్ని ఆయుర్వేదంతో ఆనందయ్య తగ్గించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఇది మందు కాదని అల్లోపతి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో శాస్త్రీయత లేదంటున్నారు.

    కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అసలు అల్లోపతి మందులు వాడినా ప్రాణాలుపోతున్నాయి. మరి ఇలాంటప్పుడు మన ప్రాచీన ఆయుర్వేదంతో మనిషి బతికితే అదే పదివేలు. అందుకే ఎంతో మంది అల్లోపతి వైద్యులు గొంతు చించుకున్న ఆనందయ్య ఆయుర్వేద మందుకు మాత్రం జనం ఎగబడుతున్నారు.ఈ ఒక్కరోజే ఏకంగా 60వేల మంది కృష్ణపట్నంకు వచ్చారు.