ఒలింపిక్స్ జరుగుతున్న వేళ టోక్యోలో కరోనా కేసులు మరోమారు భయపెట్టే స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో నేడు ఏకంగా 2,848 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోద కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా బారినపడిన అథ్లెట్లు, ఇతరుల వల్ల కేసులు మరింత ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.