భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

వీధుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత ధోరనిని తాను ప్రదర్శించలేనని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లోకి వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వీధుల్లో తిరిగి బిచ్చగాళ్లకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ మానవ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, […]

Written By: Suresh, Updated On : July 27, 2021 3:27 pm
Follow us on

వీధుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత ధోరనిని తాను ప్రదర్శించలేనని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లోకి వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వీధుల్లో తిరిగి బిచ్చగాళ్లకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ మానవ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేశారు.