
దేశంలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజు దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డుయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,693 పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3502 మంది కరోనాతో మరణించారు. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 మంది కరోనా బారినపడగా, కేరళ, ఉత్తరప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.