
కొవిడ్ పరిస్థితుల్లో కేంద్రాన్ని, ప్రాధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశ ప్రతిష్టను, ప్రధాని గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కొవిడ్ సంక్షోభంపై ఓ టూల్ కిట్ రూపొందించిందని ఆ పార్టీ ఆరోపించింది. దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర దుయ్యబట్టారు. కొవిడ్ మ్యూటెంట్ ను ఇండియన్ స్ట్రెయిన్ మోదీ స్ట్రెయిన్ అని పిలవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టూల్ కిట్ సూచనలు ఇస్తోందని ఆయన ఆరోపించారు.