కరోనా కర్కశత్వానికి వైద్యులు బలి

కరోనా కర్కశత్వానికి అందరూ బలవుతున్నారు. అందులో వైద్యులు సైతం ఉన్నారు. ప్రమాదమని తెలిసినా తమ ప్రాణాలనే పణంగా పెట్టి వైద్యసేవలందించడం గొప్ప విషయం. వైద్యాన్ని వ్యాపారంగా చూసే వారు కూడా ఉన్నా వైద్య సేవలందించడంలో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకోవడం గొప్ప విషయం. ఎంత మందికి అంత ధైర్యముంటుంది. మాకెందుకులే అనుకుంటే అయిపోయేది. కానీ వారు వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో సేవలందించి చివరికి తమ దేహాన్ని వదిలిపోవడం దారుణం. 270 మంది ప్రాణాలు హరీ దేశ […]

Written By: NARESH, Updated On : May 18, 2021 6:59 pm
Follow us on

కరోనా కర్కశత్వానికి అందరూ బలవుతున్నారు. అందులో వైద్యులు సైతం ఉన్నారు. ప్రమాదమని తెలిసినా తమ ప్రాణాలనే పణంగా పెట్టి వైద్యసేవలందించడం గొప్ప విషయం. వైద్యాన్ని వ్యాపారంగా చూసే వారు కూడా ఉన్నా వైద్య సేవలందించడంలో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకోవడం గొప్ప విషయం. ఎంత మందికి అంత ధైర్యముంటుంది. మాకెందుకులే అనుకుంటే అయిపోయేది. కానీ వారు వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో సేవలందించి చివరికి తమ దేహాన్ని వదిలిపోవడం దారుణం.
270 మంది ప్రాణాలు హరీ
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడి 270 మంది వైద్యులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంగళవారం ప్రకటించింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ ఉండడం గమనార్హం. కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. దరి చేరిన వారందరిని పొట్టన పెట్టుకుంటోంది. వైద్యసేవలందిస్తూ ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు సానుభూతి వ్యక్తం చేశారు.
వైద్యుల మరణాలు పరిశీలిస్తే..
దేశ వ్యాప్తంగా వైద్యుల మరణాలు పరిశీలిస్తే బీహార్ లో అత్యధికంగా 78 మంది, ఉత్తర ప్రదేశ్ లో 37 మంది, ఢిల్లీలో 29 మంది, ఏపీలో 22 మంది ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో వైద్యుల మరణాల సంఖ్య 748. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో వైద్యుల మరణాల రేటు తక్కువగా ఉన్నా ఆందోళన కలిగించే అంశమే. కరోనా మహమ్మారి కర్కశత్వానికి ఇంకా ఎందరు బలవుతారో వేచి చూడాల్సిందే.
ఇంకెంత కాలం
కరోనా కరాళనృత్యం చేస్తోంది. దీని ప్రభావంతో రెండేళ్లుగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇంకా ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీని ప్రభావంతో అన్ని వర్గాలు మూల్యం చెల్లించుకుంటున్నారు. తమ ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా రక్కసి ఇంకా ఎన్నాళ్లకు శాంతిస్తుందో ఎదురు చూడాల్సిందే మరి.