ఈ వారంలో వరసుగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత సెన్సెక్స్ 50 వేల మార్క్ ను దాటింది. నిఫ్టి కూడా 15 వేల పైకి ఎగబాకింది. 49,986 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 612 పాయింట్ల లాభపడి 50,193 వద్ద ముగిసింది. ఇక 15,067 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 18 పాయింట్లు ఎగబాకి 15,108 వద్ద స్థిరపడింది. ఎమ్ అండ్ ఎమ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ , టైటన్ కంపెనీ లాభాలను ఆర్జించాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, కంపెనీల క్యూ 4 ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం దేశీయ స్టాక్ మార్కెట్లులో జోష్ నింపాయి.