
పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. పీసీీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఎడ్లబండి మీద ఇందిరాపార్క్ కు వచ్చారు. పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులను అదుపులోకి తసుకున్నారు.