త్వరపడండి: 60 గజాల్లోనే ప్లాట్లు!

తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ అనుమతుల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త పురపాలక చట్టం, టీఎస్-బీపాస్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు పురపాలక సంఘం ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టులో పెడతారు. ఇక ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు అడుగులకు తగ్గించారు. వెడల్పు కనీసం 20కి నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతినిస్తారు. ఇక ప్రతి అవుట్లో […]

Written By: NARESH, Updated On : July 12, 2021 12:04 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ అనుమతుల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త పురపాలక చట్టం, టీఎస్-బీపాస్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు పురపాలక సంఘం ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టులో పెడతారు. ఇక ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు అడుగులకు తగ్గించారు. వెడల్పు కనీసం 20కి నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతినిస్తారు.

ఇక ప్రతి అవుట్లో సామాజిక అవసరాల కోసం స్థలాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. మొత్తం ప్లాట్ల విస్తీర్ణంలో 15 శాతం పురపాలక సంఘం లేదా కార్పొరేషన్ కు కేటాయించాలి. అలాగే 50 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో చేసే ప్లాట్లకు పర్యావరణ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలక సంఘాలకు వర్తిస్తాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పడి ఈ లే అవుట్లకు అనుమితినిస్తారు.

గతంలో కనీస ప్లాట్ 143 చదరపు గజాలు (120 చదరపు మీటర్లు) ఉండేది. రోడ్డు వైపు ప్లాటు 10 మీటర్ల వెడల్పు ఉంటే సరిపోతుంది. అయితే పురపాలక చట్టం కొత్త నిబంధనల ప్రకారం 60 చదరపు గజాలు (50 చదరపు మీటర్లు) ఉంటే చాలు. అలాగే రోడ్డు వైపు ప్లాటు కనీస వెడల్పు 20 మీటర్లుగా నిర్ణయించారు. ప్రతి లేఅవుట్లో 10 శాతానికి తక్కువ కాకుండా ఖాళీ స్థలాన్ని పురపాలక సంఘానికి అప్పగించాలి. ఇందులో పచ్చదనం ట్రాన్స్ ఫార్మర్, వాటర్ ట్యాంక్ తదితర అవసరాల కోసం వినియోగిస్తారు.

లేఅవుట్ అనుమతి కావాలంటే టీఎస్-బీపాస్ ద్వారా అనుమతి చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి వస్తుంది. సరైన పత్రాలతో రూ.10 వేలు చెల్లించాలి. ఒకవేళ దరఖాస్తు పత్రాలు అసంపూర్తిగా ఉంటే పదిరోజుల్లోగా తెలియజేయాలి. ధ్రువీకరణ పత్రాలు అన్నీ ఓకే అయితే కమిటీ అనుమతినిస్తుంది. అనుమతి వచ్చిన 30 రోజుల్లో మార్టిగేజ్ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలి. ఫీజు చెల్లంచిన తరువాత లే అవుట్ యజమాని సమర్పించిన గిప్ట్ డీడ్, మార్టిగేజ్ డీడ్, లేఅవుట్ ప్లాన్ లను పురపాలక కమిషనర్ సరిచూసుకొని మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిస్తారు.