కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఆస్తి తగాదా ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. చిరంజీవి, ప్రవీణ్ ఇరువురు గ్రామంలోని ఇరుగుపొరుగువారు. ఒకరితో మరొకరికి ఆస్తి వివాదం ఉంది. ఈ విషయమై శనివారం రాత్రి ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రవీణ్ ఓ భారీ కర్రతో చిరంజీవిపై దాడి చేశాడు. ఈ దాడిలో చిరంజీవి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటనపై పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.