ఆందోళనకరంగా ఏపీలో పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భయపెడుతోంది. పెద్దనగరాలైన మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలతో పాటు ఢిల్లీ నగరంలో పాజిటివిటీ రేటు అధికంగా ఉంటోంది. జీవనవిధానం, జనసాంద్రతతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ మెట్రో సిటీలు లేని ఏపీలో పాజిటివిటీ రేటు ఎక్కువగానమోదు కావడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం ఏపీ పరిస్థితి బాగా లేదని చెప్పడం సమస్య తీవ్రతను చెబుతోంది. కరోనా ఉధృతి దేశంలో కరోనా […]

Written By: NARESH, Updated On : May 16, 2021 6:12 pm
Follow us on

దేశంలో కరోనా కేసుల సంఖ్య భయపెడుతోంది. పెద్దనగరాలైన మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలతో పాటు ఢిల్లీ నగరంలో పాజిటివిటీ రేటు అధికంగా ఉంటోంది. జీవనవిధానం, జనసాంద్రతతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ మెట్రో సిటీలు లేని ఏపీలో పాజిటివిటీ రేటు ఎక్కువగానమోదు కావడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం ఏపీ పరిస్థితి బాగా లేదని చెప్పడం సమస్య తీవ్రతను చెబుతోంది.

కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి పెరగడంతో ప్రజల్లో భయం పుడుతోంది. మరణాల సంఖ్య పెరగడంతో చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజువారి కేసులు దిగి వస్తున్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం బాధిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు ఎక్కువగా చేస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పడం గమనార్హం. పాజిటివిటీ రేటు ఏపీలో 30 శాతం వరకు ఉండడం బాధాకరం. ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించి పది రోజులు దాటుతున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఆందోళన కలుగుతోంది.

గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా..
ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో వైరస్ ప్రభావం పెరుగుతందని చెబుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు సైతం ఆశించిన మేర ఉండడం లేదు. ఫలితంగా వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పాలకుల నిర్లక్ష్యం
ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరగడానికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. వైరస్ విస్తారంగా వ్యాపించడంతో ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేసుల సంఖ్య అంతకంతకూ పెరగడంతో ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. రోజురోజుకు కేసులు విస్తృతం కావడంతో కరోనా కట్టడికి ప్రణాళికలు వేస్తున్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరిగినా ఏం చేయని పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరోనా వైరస్ నిర్మూలనకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.