ఏపీ సచివాలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదల డేటా సేకరించి.. వాళ్ల పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారు. కొందరు కేటుగాళ్లు. వాళ్లు ఒకరిద్దురు కాదు ఏకంగా 50 మంది కుమ్మక్కయి ఈ వ్యవహారం నడిపారు. ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది.. ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.