Homeఎంటర్టైన్మెంట్Colors Swathi : ఘనంగా జరిగిన హీరోయిన్ కలర్స్ స్వాతి 2వ పెళ్లి.. పెళ్లి కొడుకు...

Colors Swathi : ఘనంగా జరిగిన హీరోయిన్ కలర్స్ స్వాతి 2వ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే!

Colors Swathi : ప్రముఖ హీరోయిన్ స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి నేడు గ్రాండ్ గా రెండవ వివాహం చేసుకుంది. తనతో ‘మంత్స్ ఆఫ్ మధు’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి తో ఆమె నేడు వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా కలర్స్ స్వాతి తన మొదటి భర్త వికాస్ వాసు కి విడాకులు ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. తన సినిమా ప్రొమోషన్స్ సమయంలో మీడియా రిపోర్టర్స్ ఈ అంశంపై ప్రశ్నలు అడగ్గా, కలర్స్ స్వాతి కోపం తెచ్చుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో తాను కొత్త రిలేషన్ లో ఉన్నట్టు ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు కానీ , సోషల్ మీడియా లో రూమర్స్ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉండేవి.

అవి రూమర్స్ కావని , నిజమేనని నేడు ఒకే ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది ఈ జంట. 2018 వ సంవత్సరం లో ఈమె వికాస్ వాసు ని పెళ్లి చేసుకుంది. ఈయన ఒక మలయాళీ పైలట్. రెండేళ్లకు పైగా వీళ్ళ దాంపత్య జీవితం సజావుగానే సాగింది , కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , విబేధాలు వచ్చి దూర అయ్యారు. 2022 వ సంవత్సరం లో అధికారికంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత 2023 వ సంవత్సరం లో ‘మంత్స్ ఆఫ్ మధు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమెకు డైరెక్టర్ శ్రీకాంత్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అది క్రమేణా ప్రేమగా మారి , నేడు పెళ్ళికి దారి తీసింది. ఈ వివాహ మహోత్సవం ఇరువురి కుటుంబ సభ్యులు , మిత్రుల సమక్ష్యం లో జరిగింది.

ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా విచ్చేసారు. ఈయన కలర్స్ స్వాతి కి మంచి స్నేహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక స్వాతి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చేతుల్లో ఎలాంటి సినిమా లేదు. 2017 వ సంవత్సరం వరకు ఈమె తన కెరీర్ లో హీరోయిన్ గా పీక్ ఫేస్ ని చూసింది. 2018 లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకున్నాక 2022 వ సంవత్సరం లో ‘పంచతంత్రం’ అనే చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘మంత్స్ ఆఫ్ మధు’ కూడా సరిగా ఆడలేదు. ఇప్పుడు పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న కలర్స్ స్వాతి రెండవ పెళ్లి ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular