
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులు, ఇతర వస్తువులను సీఎం పరిశీలించారు. అంతకు క్రితం ఆస్పత్రిని సందర్శించిన సీఎం అక్కడి కొవిడ్ రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.