
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. నెల రోజుల క్రితం చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సర్జరీలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చెన్నైలోని తన నివాసంలో రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు సీఎం కేసీఆర్ తర్వగా రోజా కొలుకోవాలని ఆకాంక్షించారు.