
ప్రస్తుతం మన దేశంలో కరోనాతో అల్లాడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇక్కడ కూడా ఇటీవల కాలంలో కరోనా కేసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో దేశరాజధానిలో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటున్నారు. అయితే ఢిల్లీలో ఈ కరోనా కల్లోలంలో యూకే స్ట్రెయిన్ హస్తం ఉండొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. మార్చి రెండో వారం నుంచి చివరి వారం మధ్యలో ఢిల్లీలో నమోదైన కరోనా కేసుల్లో యూకే వేరియంట్ ప్రాబల్యం రెట్టింపయింది.