
దేశంలో రెండో దశ కరోనా విస్తరిస్తున్న తరుణంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించే చర్యలు మరింత ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ లను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న కేంద్ర హొం శాఖ సంబంధిత నివేదికను వెంటనే పంపాలని కొరింది.