
కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన కుండ బద్దలు కొట్టారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని, వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని,తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ఆమ్మేవారిని కట్టడి చేయాలని కోరారు.