
సీఎం కేసీఆర్ కొవిడ్ పేషెంట్స్ ను పరామర్శించడంపై విమర్శలు సరికాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదని చెప్పారు. ప్రతి పక్షాలు అనవసరపు విమర్శలకు తావివ్వదన్నారు. ప్రాణాలు కాపాడటం అందరి ముందు ఉన్న కర్తవ్యమన్నారు. ప్రతి పక్ష పార్టీలు కొవిడ్ కట్టడిలో కలిసి రావాలన్నారు. నెల రోజుల్లో గ్యాస్ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.