YCP: జనరల్ సీట్లలో రెడ్డిలే అధికం.. భలే సోషల్ ఇంజనీరింగ్

గత ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలు పోను జనరల్ స్థానాల్లో అత్యధికంగా గెలిచింది రెడ్డి సామాజిక వర్గం నేతలే. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో.. 48 మంది రెడ్లు గెలుపు పొందారు. ఒక్క ఉరవకొండ స్థానంలో మాత్రమే వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి సామాజిక వర్గం నేత ఓడిపోయారు.

Written By: Dharma, Updated On : March 27, 2024 10:40 am

YCP

Follow us on

YCP: సాధారణంగా వైసిపి అంటేనే రెడ్డి సామాజిక వర్గ పార్టీ. ఆ సామాజిక వర్గం వైసీపీని సొంత పార్టీగా భావిస్తుంది. అందుకే జగన్ సైతం ఆ పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ జనాభాలో 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి రికార్డ్ స్థాయిలో 49 స్థానాలను కేటాయించారు. కానీ సింహ భాగంగా ఉన్న బీసీలకు 48 సీట్లు కట్టబెట్టారు. ఎస్సీ రిజర్వుడు స్థానాలు 29, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు ఏడింట వారికే కేటాయించారు. కానీ జనరల్ సీట్లలో ఎక్కువగా పోటీ చేసేది రెడ్డి సామాజిక వర్గం వారే. కానీ నోరు తెరిస్తే నా బీసీలు, నా ఎస్సీలు అని చెబుతారు. కానీ తనకు రాజకీయంగా అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్న విషయాన్ని మాత్రం ప్రస్తావించరు.

గత ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలు పోను జనరల్ స్థానాల్లో అత్యధికంగా గెలిచింది రెడ్డి సామాజిక వర్గం నేతలే. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో.. 48 మంది రెడ్లు గెలుపు పొందారు. ఒక్క ఉరవకొండ స్థానంలో మాత్రమే వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి సామాజిక వర్గం నేత ఓడిపోయారు. మిగతా అంత విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో ఒక్క రెడ్డి నేత కూడా గెలవలేదు. కానీ వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి.. రాయలసీమ నుంచి 31 మంది, కోస్తా జిల్లాల నుంచి 17 మంది విజయం సాధించారు. అందుకే ఈ ఎన్నికల్లో కూడా జగన్ రెడ్డి సామాజిక వర్గానికి 49 చోట్ల టికెట్లు ఇచ్చారు.

బీసీలు కానీ.. ఎస్టీలకు కానీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే జగన్ కు అవకాశం ఉంది. జనరల్ సీట్లలో వారికి కేటాయింపులు చేసి ఉంటే.. తన ప్రకటనకు వాస్తవికత ఉండేది. అయితే తరచూ వైసిపి నేతలు సోషల్ ఇంజనీరింగ్ చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీలే పోటీ చేశారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీలే పోటీ చేశారు. జనరల్ స్థానాల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతలతో నింపేశారు. ఎస్సీలు, బీసీలను జనరల్ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నా.. అక్కడ మాత్రం వారికి ఛాన్స్ ఇవ్వలేదు. తన సొంత సామాజిక వర్గంతో జగన్ నింపేశారు. కానీ ప్రకటనల విషయంలో బీసీలతో పాటు ఎస్సీలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు.