https://oktelugu.com/

Ajinkya Rahane Catch: అజింక్యా రహానే అదిరిపోయే క్యాచ్.. అచ్చం చేపలాగానే ఎగిరాడు.. వీడియో వైరల్

రహానే పట్టిన అద్భుతమైన క్యాచ్ కు డేవిడ్ మిల్లర్ (26) నిరాశతో మైదానాన్ని వీడాడు. తుషార్ పాండే వేసిన 12 ఓవర్లో మిల్లర్ అవుట్ అయ్యాడు. ఈ ఓవర్ ఐదో బంతిని తుషార్ లెగ్ స్టంప్ దిశగా వేశాడు.

Written By: , Updated On : March 27, 2024 / 10:35 AM IST
Ajinkya Rahane Catch

Ajinkya Rahane Catch

Follow us on

Ajinkya Rahane Catch: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై జట్టు విజయపరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో బెంగళూరు పై విజయం సాధించిన చెన్నై.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటింది. ఏకంగా 60కి పై చిలుకు పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 200కు పైగా పరుగులు చేసింది. గుజరాత్ మందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ తో అద్భుతాలు చేసిన చెన్నై జట్టు.. ఫీల్డింగ్ లోనూ అంతకుమించి అన్నట్టుగా ఆడింది. విజయ్ శంకర్ క్యాచ్ ను అమాంతం డైవ్ చేసి కీపర్ మహేంద్ర సింగ్ ధోని పడితే.. దానిని తలదన్నేలా అజింక్యా రహానే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

రహానే పట్టిన అద్భుతమైన క్యాచ్ కు డేవిడ్ మిల్లర్ (26) నిరాశతో మైదానాన్ని వీడాడు. తుషార్ పాండే వేసిన 12 ఓవర్లో మిల్లర్ అవుట్ అయ్యాడు. ఈ ఓవర్ ఐదో బంతిని తుషార్ లెగ్ స్టంప్ దిశగా వేశాడు. మిల్లర్ వెంటనే దాన్ని ఫ్లిక్ షాట్ లాగా ఆడాడు. అయితే అతడు కొట్టిన కొట్టుడుకు బంతి గాల్లో లేచింది. డీప్ మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రహానే సుడిగాలి వేగంతో పరిగెత్తుకొచ్చాడు. ఒక్క ఉదుటన బంతిని అందుకున్నాడు. రహానే పట్టిన క్యాచ్ చూసి మిల్లర్ నిర్ఘాంత పోయాడు. నిరాశతో మైదానం వీడిపోయాడు.

ఈ క్యాచ్ చూసిన అభిమానులు రహానేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ” అతడు కొట్టిన వేగానికి బంతి సుడిగాలి వేగంతో వెళ్లిపోయింది. దాని రహానే అంతకుమించిన వేగంతో దానిని పట్టుకున్నాడు. ఒక్కోసారి భౌతిక శాస్త్రం కూడా చిన్న బోతుంది కావచ్చు. గతి శక్తి, స్థితి శక్తికి సరికొత్త నిర్వచనాలు ఇవ్వాలి కావచ్చు. ఐని స్టిన్ వంటి మహాశయులు ఈ కాలంలో పుట్టి ఉంటే కచ్చితంగా సరికొత్త సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు కావచ్చు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రహానే ఈ క్యాచ్ పట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ అయింది. అప్పటిదాకా కీలక ఆటగాళ్లు ఔట్ అయినప్పటికీ మిల్లర్ మీద గుజరాత్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఎలాగైనా జట్టును గెలిపిస్తాడని భావించింది. కానీ అతడు అనూహ్యంగా క్యాచ్ అవుట్ కావడంతో ఒక్కసారిగా గుజరాత్ ఆశలు ఆవిరైపోయాయి. మిల్లర్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ ఉన్నంతలో కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ కొండంత పెరిగిపోవడంతో గుజరాత్ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.