
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బయటుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్, మరి కొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారు.