https://oktelugu.com/

కేసీఆర్ కరీంనగర్ సడెన్ టూర్.. కథేంటి?

సీఎం కేసీఆర్ సడెన్ గా ఉమ్మడి కరీంనగర్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ప్రతీకారచర్యలు ఉండబోతున్నాయా? ఈటలను ఇరికించే ప్లాన్లు ఏమైనా చేశాడా? ఉమ్మడి కరీంనగర్ రాజకీయాలను వేడెక్కించేలా కేసీఆర్ కరీంనగరంలోని ‘ఉత్తర తెలంగాణ భవన్ ’లో బస చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసీఆర్ పర్యటనలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సుమన్ తోపాటు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 9:19 pm
    Follow us on

    సీఎం కేసీఆర్ సడెన్ గా ఉమ్మడి కరీంనగర్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ప్రతీకారచర్యలు ఉండబోతున్నాయా? ఈటలను ఇరికించే ప్లాన్లు ఏమైనా చేశాడా? ఉమ్మడి కరీంనగర్ రాజకీయాలను వేడెక్కించేలా కేసీఆర్ కరీంనగరంలోని ‘ఉత్తర తెలంగాణ భవన్ ’లో బస చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

    అయితే కేసీఆర్ పర్యటనలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సుమన్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.

    అయితే ఈటల రాజేందర్ రాజీనామా చేయడం.. బీజేపీలో చేరికకు ముహూర్తం రెడీ చేసుకోవడం.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తుండడంతో సీఎం పర్యటన ఆసక్తి రేపుతోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ హైదరాబాద్ వదిలి వస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో సీఎం పర్యటనపై దృష్టి సారించింది.

    అయితే బాల్కసుమన్ ను పరామర్శించడంతోపాటు జగిత్యాలలో ఎల్. రమణను చేర్చుకునేందుకే కేసీఆర్ వస్తున్నాడని.. ఈటల స్థానంలో అతడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. రేపటి వరకు దీనిపై క్లారిటీ రానుంది.