
విద్యాశాఖ, అంగన్ వాడీల్లో నాడు-నేడు పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్నారు.