
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూరల్ మండలంలోని చినగదిలి వద్ద సర్వే నంబరు 72, 73, 83 పరిధిలో రెండెకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు పీవీ సింధుకు కేటాయించిన భూమిని పశుసంవర్థక, యువజన సర్వీసులు, క్రీడా శాఖను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రమోజనాల దృష్ట్యా ఈ భూమిని ఉచితంగానే కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.