
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో అన్ని జూ పార్క్ లు మూసివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్ లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్ ల్లో జంతువు ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపటి నుంచి రాష్ట్రంలో కర్ప్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.