
చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్టంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1970 నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది. 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా దీనిని ముగ్గురికి పెంచడం గమనార్హం.