సంచలన నిర్ణయం: మహేష్ గొప్ప మనసు

రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్ లోనూ తాము హీరోల‌మే అని చాటుకునేవారు టాలీవుడ్ లో కొంద‌రున్నారు. అలాంటి వారిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌ర‌స‌లోనే ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలే ఈ విష‌యాన్ని చాటి చెబుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు వెయ్యి మంది చిన్నారుల‌కు గుండె సంబంధిత చికిత్స‌లు చేయించారు ప్రిన్స్‌. దాదాపు ఇవ‌న్నీ ఆప‌రేష‌న్లే. ఇందుకు సంబంధించిన ఖ‌ర్చు మొత్తం తానే భ‌రించారు. దీంతోపాటు.. ఇంకా […]

Written By: Bhaskar, Updated On : May 31, 2021 3:01 pm
Follow us on

రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్ లోనూ తాము హీరోల‌మే అని చాటుకునేవారు టాలీవుడ్ లో కొంద‌రున్నారు. అలాంటి వారిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌ర‌స‌లోనే ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలే ఈ విష‌యాన్ని చాటి చెబుతాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు వెయ్యి మంది చిన్నారుల‌కు గుండె సంబంధిత చికిత్స‌లు చేయించారు ప్రిన్స్‌. దాదాపు ఇవ‌న్నీ ఆప‌రేష‌న్లే. ఇందుకు సంబంధించిన ఖ‌ర్చు మొత్తం తానే భ‌రించారు. దీంతోపాటు.. ఇంకా అనేక‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు.

ఇక‌, శ్రీమంతుడు సినిమా త‌ర్వాత నిజ జీవితంలోనూ శ్రీమంతుడిగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని, వాటి బాగోగులుకూడా చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇవాళ మ‌హేష్ ఫాద‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్బంగా గుర్తుండిపోయేలా ఏదైనా మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని భావించిన ప్రిన్స్‌.. త‌న స్వ‌గ్రామం బుర్రిపాలెంను ఇందుకు వేదిక‌గా చేసుకున్నారు.

ఈ గ్రామంలోని వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ ఎంత అవ‌స‌రంగా మారిపోయిందో అంద‌రికీ తెలిసిందే. కానీ.. వ్యాక్సిన్ అందుబాటులో లేక‌, డ‌బ్బులు చెల్లించి వేయించుకోలేక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో.. గ్రామంలోని వారికి వ్యాక్సిన్ వేయించారు.

ఈ స్పెష‌ల్ డ్రైవ్ లో వంద‌లాది మంది బుర్రిపాలెం వాసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రా హాస్పిట‌ల్స్ కూడా భాగం పంచుకుంది. తండ్రి జ‌న్మ‌దినం వేళ మ‌హేష్ చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మాన్ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. బుర్రిపాలెం గ్రామ‌స్థులు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.