https://oktelugu.com/

అది ఇవ్వాలని హీరోయిన్లను ఒత్తిడి చేయొద్దు – తమన్నా

సాయం అనేది చేసే మనసును బట్టి దాని విలువ ఉంటుంది గాని, ఆ సాయం తాలూకు వస్తు వు యొక్క ఆర్ధిక ప్రమాణాన్ని బట్టి దాన్ని కొలవలేము. సమాజంలో ఏదైనా సమస్య వస్తే.. విరాళాలు ప్రకటించి… అవసరం ఉన్న వారికీ సాయం అందించడంలో సినిమా వాళ్ళు ఎప్పుడూ ముందు ఉంటారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ప్రజలు కష్ట కాలంలో సాయం చేసే సినిమా వాళ్ళకే అన్ని అవమానాలు, అపవాదులు. సొసైటీలో ఏ ఆపద […]

Written By: , Updated On : May 31, 2021 / 03:11 PM IST
Follow us on

సాయం అనేది చేసే మనసును బట్టి దాని విలువ ఉంటుంది గాని, ఆ సాయం తాలూకు వస్తు

వు యొక్క ఆర్ధిక ప్రమాణాన్ని బట్టి దాన్ని కొలవలేము. సమాజంలో ఏదైనా సమస్య వస్తే.. విరాళాలు ప్రకటించి… అవసరం ఉన్న వారికీ సాయం అందించడంలో సినిమా వాళ్ళు ఎప్పుడూ ముందు ఉంటారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ప్రజలు కష్ట కాలంలో సాయం చేసే సినిమా వాళ్ళకే అన్ని అవమానాలు, అపవాదులు.

సొసైటీలో ఏ ఆపద వచ్చినా సినిమా వాళ్ళు లక్షలు, అవసరం అయితే కోట్లు కూడా దానం చేయడానికి ముందుకు వస్తారు. అంతమాత్రాన ఏ చిన్న ఆపద వచ్చినా.. హీరోయిన్లు ఎందుకు దానం చెయ్యరు ? స్టార్ హీరోలు ఎందుకు కోట్ల రూపాయలు డోనేట్ చెయ్యరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేయడం మరీ అలవాటు అయిపోయిందని అంటుంది మిల్క్ బ్యూటీ తమన్నా.

తమన్నా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలకు ఆపద వస్తే.. సినిమా వాళ్ళు
డబ్బులు ఇవ్వరా? అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నించడం ప్రతిఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. దానం చేయాలనుకునే వారు ఎలాగూ చేస్తారు. అయినా సాయం కూడా అందరికి చెప్పి చేస్తారా ? సమాజ సేవ చేసేవారిలో కొందరు బయటికి చెప్పుకుంటారు.

మరికొందరు సైలెంట్ గానే సేవ చేస్తూ తమకు తోచినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తారు. అయితే, ఏ స్టేట్ లో వరదలొచ్చినా, కరోనా కేసులు పెరిగినా హీరో, హీరోయిన్లు ఎందుకు విరాళాలు ప్రకటించడం లేదు అని అడగడం బాగాలేదు అంటూ తమన్నా తెగ ఫీల్ అయిపోయింది. ఈ మధ్య తమిళనాడులో అక్కడి స్టార్లు లక్షల రూపాయలను విరాళాలుగా ప్రకటించారు. ఈ క్రమంలో తమన్నా ఎందుకు విరాళం ప్రకటించలేదు అని ఎవరో అన్నారట. అందుకే విరాళం ఇవ్వాలని హీరోయిన్లను ఒత్తిడి చేయొద్దు అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.