
తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకులు పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాకులు పనివేళలల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్ డౌన్ క్రమంలో బ్యాంకులు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉండేవి. సడలింపులు ఇవ్వడంతో నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది.