
భారత్- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకం, అనుమానం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదన్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని ఏర్పర్చుకోవాలంటే పాకిస్థాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకోవాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టబడి ఉండాలని నరవణే అభ్రిప్రాయపడ్డారు. నమ్మకాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పాకి్స్థాన్ పైనే ఉందని చెప్పారు. నరవణే జమ్మ- కశ్మీర్ భద్రత పరిస్థితులను గురువారం సమీక్షించారు.