
ప్రముఖ బ్రిటిష్ పత్రిక వోగ్ తన ముఖచిత్రంపై మలాలా యూసుఫ్ జాయ్ ను చేర్చింది. ది ఎక్ట్సార్డినరీ లైఫ్ మలాలా సర్వైవర్, లెజెండ్ అనే టైటిల్ తో మలాలా ఘన కార్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది. జూలై సంచిక మలాలా కవర్ పేజీతో వెలువడనున్నది. వోగ్ పత్రిక తనను ముఖచిత్రం పై వేయడాన్ని మరింత గౌరవాన్ని కల్పించిందని మలాలా అభిప్రాయపడింది. మలాలా చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన నోబెల్ బహుమతి గ్రహీత. కానీ అది ఆమె సాధించిన ఏకైక అంశం కాదు. ఆమె మనసులో కదిలే జ్క్షాపకాలను వోగ్ పత్రిక ప్రచురించింది.