రాష్ట్రంలో సుపరిపాలన నిమిత్తం గవర్నర్ ను వెంటనే మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. నారద కుంభకోణంలో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి మాజీ మేయర్ తో పాటు నలుగురు తృణమూల్ నాయకులను సీబీఐ సోమవారం అరెస్టు చేసిన వెంటనే మమతా ఈ లేఖ రాసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత గవర్నర్ జగదీప్ రాష్ట్రంల శాంతి, భద్రతలను అదుపులో ఉంచకపోతే తీవ్ర చర్యలు తప్పవంటూ మమతాను హెచ్చరించారు. గవర్నర్ ప్రభుత్వ పనితీరును అస్థిరపిచేందుకు ప్రయత్నిస్తున్నారని వెంటనే గవర్నర్ ను మార్చాలని మమతా తన లేఖలో కోరారు.