కరోనా ఫస్ట్ వేవ్ లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా సెకండ్ వేవ్ లో మాత్రం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండు లక్షలకు పైగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా సోకితే నెగిటివ్ వచ్చినా ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కరోనా వైరస్ గుండెపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
కరోనా సోకిన తరువాత యువకులు సైతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇకపోతే కరోనా వైరస్ సోకిన వాళ్లు భోజన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. భోజన నియమాలను పాటించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గడంతో పాటు వేగంగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. కరోనా బాధితులు నిద్ర లేచిన వెంటనే ఎండు ద్రాక్ష, నానబెట్టిన బాదం తీసుకోవాలి.
ఎండుద్రాక్షలో ఉండే ఐరన్, బాదంలో ఉండే మాంసకృత్తులు కరోనా వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి. రాగి దోశ లేదా పోర్జిడ్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం రోటీ తీసుకుంటే మంచిది. రోటీతో పాటు నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మరీ మంచిది. రాత్రి భోజనంలో కిచిడీ తీసుకోవాలి. ప్రతిరోజూ నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
కరోనా యువకులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆక్సిజన్ లేమి వల్ల గుండెలో మంట వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.