
కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితుల వద్ద కరోనా పాజిటీవ్ ధృవపత్రం లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని నిర్దేశించింది. లక్షణాలు కనిపించేవారిని కనోనా అనుమానిత కేసులుగా పరగణించి రోగి తీవ్రతను బట్టి కోవిడ్ కేర్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్, డెకికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులల్లో చేర్చుకుని చికిత్స అందించాలని సూచించింది. ఏదో ఒక కారణం చెప్పి రోగికి వైద్య సేవలు నిరాకరించడానికి ఇకపై వీల్లేదని ఆక్సిజన్ అత్యవసర మందులు అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.