https://oktelugu.com/

గదిలో 20ఏళ్ల యువతి.. నలుగురు 9 రోజులు అత్యాచారం

ఉత్తర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒక 20 ఏళ్ల యువతిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కారులో వచ్చిన నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం గదిలో బంధించి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. దారుణం ఏంటంటే యువతికి తెలిసిన వారే వారంతా.. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండడం విస్తుగొలుపుతోంది. హర్యానాలోని సోహ్నా గ్రామానికి చెందిన వివాహత (20)ను గత నెల 30న పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుండగా నలుగురు వచ్చి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 14, 2021 / 08:41 PM IST
    Follow us on

    ఉత్తర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒక 20 ఏళ్ల యువతిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కారులో వచ్చిన నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం గదిలో బంధించి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. దారుణం ఏంటంటే యువతికి తెలిసిన వారే వారంతా.. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండడం విస్తుగొలుపుతోంది.

    హర్యానాలోని సోహ్నా గ్రామానికి చెందిన వివాహత (20)ను గత నెల 30న పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుండగా నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు. యువతిని ఫరిదాబాద్ లో ఓ గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

    తొమ్మిది రోజుల తర్వాత అంటే జులై 8న ఆమె వారి నుంచి తప్పించుకొని భల్లబ్ గఢ్ బస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి వారి కుటుంబానికి ఫోన్ చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

    ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అపహరించిన వారు తెలుసని.. వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

    మరోవైపు బాధితురాలికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సహకరించిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.