
జాతీయ పంచాయతీ డేలో భాగంగా స్వామిత్వ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 4.09 లక్షల ఆస్తి యజమానులకు కార్టులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పాల్గొననున్నారు.