Nagarjuna Meets CM Chandrababu : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress ) మద్దతుగా సినీ పరిశ్రమకు చెందిన చాలామంది వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమ కోసం పరితపిస్తుంటే తనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తాము అందరి చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. వ్యక్తులు చూడడం లేదని.. వ్యవస్థ గానే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నాగార్జున వారసుల విషయం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. తద్వారా గతంలో నాగార్జున జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అని అర్థం వచ్చేలా గుర్తు చేశారు. అయితే తాజాగా అదే నాగార్జున ఏపీ సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతికి వచ్చిన నాగార్జున చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
* జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు..
అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో జైల్లో ఉన్నప్పుడు స్వయంగా పరామర్శించారు నాగార్జున. అప్పటినుంచి ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడని ముద్రపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి అనే ముద్ర కూడా నాగార్జున పై ఉంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో పెద్దగా నాగార్జునకు సన్నిహితం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన టిడిపికి వ్యతిరేకి అని ప్రచారం ఉంది. ఇటీవల హైదరాబాదులో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలను ముడిపెడుతూ రేవంత్ సర్కార్ చేపట్టిన ఈ ఆపరేషన్ పై అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీని వెనుక ఏపీ పెద్దల హస్తం ఉందని కూడా ప్రచారం జరిగింది.
Also Read : సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున
* చిత్ర పరిశ్రమతో వివాదం..
ప్రస్తుతం చంద్రబాబు( CM Chandrababu) నేతృత్వంలోని కూ టమి ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమకు గ్యాప్ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ చేయాలన్న అంశం వివాదాస్పదంగా మారింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ జారీ అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా సినీ పెద్దలు ఎవరు సీఎం చంద్రబాబును కలవడానికి రాలేదంటూ పవన్ ఆక్షేపించారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే అక్కినేని నాగార్జున సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకాంతంగా భేటీ కావడం కూడా విశేషం.
* వివాహానికి ఆహ్వానించేందుకే..
అయితే అక్కినేని నాగార్జున అమరావతి( Amaravathi ) పర్యటన వ్యక్తిగతం అని తెలుస్తోంది. నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల 6న జైనబ్ అనే యువతితో వివాహం జరగనుంది. గత కొద్ది రోజులుగా అఖిల్ జైనబ్ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దవారు ఓకే చెప్పడంతో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు అక్కినేని నాగార్జున. అందులో భాగంగానే ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసినట్లు సమాచారం. కాగా అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య- శోభిత వివాహం గత ఏడాది జరిగింది. ఇప్పుడు చిన్న కుమారుడు వివాహం జరగనుంది.
