
వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నూతన ప్రైవసీ పాలసీలో చేపట్టిన మార్పులు డేటా భద్రతను బలహీనపరచడమే కాకుండా భారతీయుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంతృప్తికర సమాధానం రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.